ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనరల్ రావత్ నీళ్లు కావాలని అడిగారు: ప్రత్యక్ష సాక్షి

ABN, First Publish Date - 2021-12-09T22:23:34+05:30

నేను,నా సోదరుడు మేం పని చేసే టీ-ఎస్టేట్‌కు వెళ్లుండగా హెలికాఫ్టర్ ప్రమాదాన్ని గమనించాము. మా కళ్ల ముందే హెలికాఫ్టర్ కూలిపోయింది. హెలికాఫ్టర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నాం. ముగ్గురు పడిపోవడం మాత్రం కనిపించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ నీళ్లు కావాలని అడిగారని ప్రమాదాన్ని చూసిన శివకుమార్ ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పాడు. హెలికాఫ్టర్ నిప్పుల్లో ఉన్న సంగతి పసిగట్టిన తాను, తన సోదరుడు హెలికాఫ్టర్ కూలిన ప్రదేశానికి వెళ్లామని, ఆ సమయంలో బిపిన్ రావత్ నీళ్లు కావాలని అడిగినట్లు పేర్కొన్నాడు. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని, ఇంటికెళ్లిన తర్వాత సీడీఎస్ అని తెలిసిందని శివకుమార్ చెప్పుకొచ్చాడు.


కూనూర్‌కు చెందిన శివకుమార్ మాట్లాడుతూ ‘‘నేను,నా సోదరుడు మేం పని చేసే టీ-ఎస్టేట్‌కు వెళ్లుండగా హెలికాఫ్టర్ ప్రమాదాన్ని గమనించాము. మా కళ్ల ముందే హెలికాఫ్టర్ కూలిపోయింది. హెలికాఫ్టర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నాం. ముగ్గురు పడిపోవడం మాత్రం కనిపించింది. అందులో ఒక వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నారు. నీళ్లు కావాలని అడిగారు. మేం అతడిని ఒక బెడ్‌షీట్‌లోకి మార్చాము. అనంతరం రెస్క్యూటీం వాళ్లు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ఆయన ఎవరో తెలియదు. ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి అని ఇంటికి వచ్చాక తెలిసింది. అది తెలిసి నాకు రాత్రంతా నిద్రపట్టలేదు’’ అని అన్నాడు.


బిపిన్ రావత్.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణకు త్రివిధ దళాలను రక్షణ మంత్రి ఆదేశించారు.

Updated Date - 2021-12-09T22:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising