ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి సాయంత్రం ఢిల్లీకి రావత్, ఆయన సతీమణి మృతదేహాలు

ABN, First Publish Date - 2021-12-09T15:56:22+05:30

నేటి సాయంత్రానికి చీఫ్ ఆఫ్ డిఫెన్సె స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మృతదేహాలు ఢిల్లీ చేరుకోనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకూ భౌతిక కాయాన్ని ప్రజలు సందర్శించేందుకు అనుమతించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : నేటి సాయంత్రానికి చీఫ్ ఆఫ్ డిఫెన్సె స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మృతదేహాలు ఢిల్లీ చేరుకోనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకూ భౌతిక కాయాన్ని ప్రజలు సందర్శించేందుకు అనుమతించనున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. నిన్న సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా రావత్‌, రక్షణ సిబ్బంది సహా మొత్తం 14 మందితో ప్రయాణిస్తున్న ఎంఐ17వీ5 హెలికాప్టర్‌ ముక్కలుముక్కలై పోయింది. ఈ ఘోర దుర్ఘటనలో రావత్‌ దంపతులతోపాటు మొత్తం 13 మంది మరణించారు. ఒకే ఒక్కరు.... గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ మాత్రం తీవ్రమైన కాలిన గాయాలతో సజీవంగా బయటపడ్డారు. ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఊటీ సమీపంలోని కున్నూరు వద్ద ఈ ఘోరం జరిగింది.

Updated Date - 2021-12-09T15:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising