ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narayan Rane ఆరోగ్యం సరిగా లేదు: శివసేన

ABN, First Publish Date - 2021-08-29T13:42:29+05:30

మాది ప్రతీకార రాజకీయాలని నారాయణ రాణె అంటున్నారు. రైతులపై ఎవరు ప్రతీకార, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసు. నారాయణ రాణె ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కేంద్రమంత్రి నారాయణ రాణె ఆరోగ్యం సరిగా లేదని, ఆయన యోగా చేయాల్సిన అవసరం ఎంతో ఉందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ విమర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను చెప్పుతో కొట్టాలంటూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు అవడంతో నారాయణ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై ఆయన విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే శివసేన ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన నారాయణ రాణె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ సంజయ్ రౌత్.. రైతులపై అహంకార, ప్రతీకార వైఖరితో వ్యవహరిస్తున్నది భారతీయ జనతా పార్టీయేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘మాది ప్రతీకార రాజకీయాలని నారాయణ రాణె అంటున్నారు. రైతులపై ఎవరు ప్రతీకార, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసు. నారాయణ రాణె ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ఆయనకు యోగా చేయడం చాలా అవసరం. ఆయన ఒక విషయం గుర్తుంచుకోవాలి. అరెస్ట్ చట్టబద్ధంగా జరిగింది. చట్టం ముందు అందరూ సమానులే. ఆయన ఆరోగ్యం బాగుండాలని శివ సైనికులు కూడా కోరుకుంటారు’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

Updated Date - 2021-08-29T13:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising