ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాయావతిపై అభ్యంతకర వ్యాఖ్యలు: బాలీవుడ్ నటుడిపై వేటు

ABN, First Publish Date - 2021-05-28T21:55:44+05:30

మాయావతిపై రణ్‌దీప్ హూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో గురువారం ట్వీట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో షేర్ చేస్తూ రణ్‌దీప్ హూడాపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతిపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకుగాను బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హూడాను అడవి జంతువుల వలస జాతుల పరిరక్షణ సమావేశం (సీఎంఎస్) బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి శుక్రవారం ప్రకటించింది. 2012 ఓ ఛానల్ నిర్వహించిన సమావేశంలో రణ్‌దీప్ హూడా చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వ్యాఖ్యలను ‘‘సెక్సీయెస్ట్, క్యాస్టీయెస్ట్‌‌‌‌’’ అంటూ రణ్‌దీప్ హూడాపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఈ విషయమై సీఎంఎస్ సెక్రెటేరియట్ శుక్రవారం స్పందిస్తూ ‘‘వీడియా ప్రకారం రణ్‌దీప్ హూడా చేసిన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి. ఐక్యరాజ్య సమితి విలువలకు ఇవి ఎంత మాత్రం సంబంధం లేనివి. 2012 నాటి ఆ వీడియో గురించి మాకు అంత అవగాహన లేదు. రణ్‌దీప్‌ను మేము 2020లో జంతువుల వలస జాతుల పరిరక్షణ కోసం అంబాసిడర్‌గా నియమించాం’’ అని పేర్కొన్నారు.


మాయావతిపై రణ్‌దీప్ హూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో గురువారం ట్వీట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో షేర్ చేస్తూ రణ్‌దీప్ హూడాపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అరెస్ట్ రణ్‌దీప్ హూడా’’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌ను కుదిపివేసింది.











Updated Date - 2021-05-28T21:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising