ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టు 15న రైతుల ట్రాక్టర్స్ పరేడ్ : రాకేష్ తికాయత్

ABN, First Publish Date - 2021-07-26T23:57:34+05:30

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆగస్టు 15వ తేదీన ట్రాక్టర్ల ర్యాలీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆగస్టు 15వ తేదీన ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ సోమవారంనాడు ప్రకటించారు. 14వ తేదీన రైతులు ట్రాక్టర్లపై ఘాజిపూర్ సరిహద్దులకు చేరుకుంటారని, 15న అక్కడే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని చెప్పారు. రెండు జిల్లాల నుంచి ట్రాక్టర్లు వెళ్తాయని చెప్పారు. ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లి, ప్రభుత్వ విధానాలు, పనితీరుపై రైతులతో మాట్లాడాలని సంయుక్త మోర్చా నిర్ణయించినట్టు కూడా తెలిపారు. సెప్టెంబర్ 5న ముజఫర్‌నగర్‌లో భారీ పంచాయతీ నిర్వహించాలని కూడా మోర్చా నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ట్రాక్టర్ ర్యాలీ తీయడం చెడ్డ పనేమీ కాదని, జాతీయ జండాతో ట్రాక్టర్లు నడపడం వల్ల ప్రజల్లో జాతీయతాభావం కూడా పెరుగుతుందని ఇటీవల తికాయత్ అన్నారు.



Updated Date - 2021-07-26T23:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising