ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభలో డీఎంకేకు పెరగనున్న బలం

ABN, First Publish Date - 2021-06-18T13:33:22+05:30

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ మూడు సీట్లను అధికార డీఎంకే సునాయాసంగా గెలుచుకోనుంది. ప్రస్తుతం రాజ్యసభలో డీఎంకేకు ఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

           - అధికార పార్టీకే ముగ్గురు రాజ్యసభ సభ్యులు


చెన్నై: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ మూడు సీట్లను అధికార డీఎంకే సునాయాసంగా గెలుచుకోనుంది. ప్రస్తుతం రాజ్యసభలో డీఎంకేకు ఏడుగురు సభ్యులు ఉన్నారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ సంఖ్య పదికి చేరనుంది. వచ్చే యేడాది కూడా రాష్ట్రంలో మరికొన్ని రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఆ సీట్లను కూడా డీఎంకే గెలుచుకోనుండడంతో రాజ్యసభలో డీఎంకే బలం మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల విషయమై డీఎంకే ఎంపీలు టీఆర్‌ బాలు, విల్సన్‌ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలుసుకున్నారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుశీల్‌ చంద్రా, కమిషనర్లు రాజీవ్‌కుమార్‌, అనుప్‌ చంద్రపాండేను వీరిరువురు కలుసుకుని రాష్ట్రంలో ఖాళీపడిన మూడు రాజ్యసభ స్థానాలకు 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వీలైనంత త్వరగా జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ యేడాది మార్చి 23న అన్నాడీఎంకే ఎంపీ మహమ్మద్‌జాన్‌ మృతి చెందారని, మే నెల 10న అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు ఆర్‌ వైద్యలింగం, కేపీ మునుసామి తమ పదవులకు రాజీనామా చేయడంతో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీపడ్డాయని టీఆర్‌ బాలు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T13:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising