ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు తీవ్రవాదంపై పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్

ABN, First Publish Date - 2021-08-30T22:14:00+05:30

పొరుగు దేశమైన పాక్‌ తీరును కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంగట్టారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని అస్థిరపరచేందుకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పొరుగు దేశమైన పాక్‌ తీరును కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎండగట్టారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని అస్థిరపరచేందుకు ఇండియా వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తునే ఉన్నాయని అన్నారు. పాకిస్థాన్ గడ్డ నుంచి ఈ కల్లోలం సృష్టించేందుకు పెద్దఎత్తునే ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయని 'ఏఎన్ఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ అన్నారు. సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తున్నందున గత ఫిబ్రవరిలో పాక్, భారత్ మధ్య గత ఫిబ్రవరిలో ఒప్పందం జరిగిందని, ఇరు అణ్వాస్త్ర దేశాల మధ్య పరస్పర విశ్వాసం పాదుకొలిపేందుకు ఇండియా వేచిచూసే ధోరణిని అవంలభిస్తోందని చెప్పారు.


కశ్మీర్‌లో ఉగ్రవాదానికి తెర..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంపై రాజ్‌నాథ్ మాట్లాడుతూ, 370వ అధికరణ రద్దుతో వేర్పాటువాదులకు మద్దతిచ్చే నెట్‌వర్క్‌ను ధ్వసం చేశామని చెప్పారు. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి తెరపడటం ఖాయమని తాను బలంగా నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. వేర్పాటువాదులకు ఊతమిచ్చే 370 అధికారణ, 35-ఏకు ముగింపు పలకడమే ఇందుకు కారణమని అన్నారు. గల్వాన్ వ్యాలీ ఘటన జరిగి ఏడాదైందని, సైనికుల సాహసం, శక్తిసామర్థ్యాలు, ఇండియన్ ఆర్మీ చూపించిన సంయమనం అసామాన్యమని అన్నారు. ఈ సాహసవీరులను చూసి భవిష్యత్ తరాలు కూడా గర్విస్తాయని చెప్పారు. లద్దాఖ్, నార్త్ ఈస్ట్‌లో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టుల పని జరుగుతోందని, ఇవి కేవలం మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులే కాకుండా, జాతీయ భద్రతా గ్రిడ్‌లో కీలకమని రాజ్‌నాథ్ చెప్పారు.

Updated Date - 2021-08-30T22:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising