ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్ 'ఖేల్‌రత్న' పేరు మార్పు నిరర్ధక ప్రయత్నం: కాంగ్రెస్

ABN, First Publish Date - 2021-08-06T20:05:55+05:30

''రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం'' పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ''రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం'' పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. క్రీడా పురస్కారం పేరు మార్పుతో మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడింది. ఒలంపియన్, రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ పూనియా మాట్లాడుతూ, ఉన్న అవార్డుకు పేరు మార్పు వృథా ప్రయత్నమని అన్నారు. దీనికి బదులుగా లెజెండ్రీ క్రికెటర్ ధ్యాన్ చంద్ పేరుతో కొత్త అవార్డును ప్రకటించి ఉండవచ్చని అన్నారు. ధ్యాన్‌ చంద్‌కు బీజేపీ ప్రభుత్వం మొదట 'భారతరత్న'తో గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు.


జాతీయ అవార్డుకు కాషాయం రంగు పులుపుతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కె.సురేష్ విమర్శించారు. పేరు మార్పు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశాన్ని నడిపిన ప్రధాని రాజీవ్ గాంధీ అని, ఆయన క్రీడలు, యువతను ప్రోత్సహంచారని, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని అన్నారు. ప్రతీదీ కాషాయీకరణ చేయాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని, అందులో భాగంగానే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, మొతోరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంగా మార్చారని, ఇప్పుడు రాజీవ్ అవార్డు పేరు మార్పు నిర్ణయం తీసుకుందని డిజిటల్ కమ్యూనికేషన్స్ అండ్ సోషల్ మీడియా కాంగ్రెస్ జాతీయ కన్వీనర్ గౌరవ్ పాంధి అన్నారు. పెగాసస్, రైతుల నిరసనలు, రఫేల్, ధరల పెరుగుదల వంటి వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు మోదీ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు.

Updated Date - 2021-08-06T20:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising