ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రజినీకాంత్‌ అభిమానుల ఓట్లు మాకే..’

ABN, First Publish Date - 2021-01-12T15:46:55+05:30

‘రజినీకాంత్‌ అభిమానుల ఓట్లు మాకే..’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు బీజేపీకే ఓటు వేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కన్నియకుమారి జిల్లా పార్టీ నాయకుల సమావేశం సోమవారం నాగర్‌కోయిల్‌లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా మురుగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మురుగన్‌ మాట్లాడుతూ.... రాష్ట్ర్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  మహిళా మోర్చా ఆధ్వ ర్యంలో ‘నమ్మ ఊరు పొంగల్‌’ వేడుకలు కోలాహలంగా జరిగాయన్నారు.




మదురై జిల్లా బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో బూత్‌ కమిటీల ఏర్పాటు, కన్నియకుమారి పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నిక, రానున్న  అసెంబ్లీ ఎన్నికలపై చర్చించామని తెలిపారు. కన్నియకుమారి ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఈ ఉపఎన్నిక విజయానికి తొలి మెట్టు కాబోతోందన్నారు. కేంద్రప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రూ.6 వేల ప్రోత్సాహక భత్యం రాష్ట్రంలో 41 లక్షల మంది పొందుతున్నారన్నారు.  కొత్త వ్యవసాయ చట్టాలు రైతులు మేలు చేస్తాయని, రాజకీయ లబ్ధి కోసమే ఆ చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే ఆందోళన చేస్తోందన్నారు.

Updated Date - 2021-01-12T15:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising