ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమాచల్ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్ ప్రమాణస్వీకారం

ABN, First Publish Date - 2021-07-13T17:20:04+05:30

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా భారతీయ జనతా పార్టీ నేత, గోవా అసెంబ్లీ మాజీ స్పీకర్ రాజేంద్ర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా భారతీయ జనతా పార్టీ నేత, గోవా అసెంబ్లీ మాజీ స్పీకర్ రాజేంద్ర అర్లేకర్ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 6న హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్‌గా ఆయన నియమితులయ్యారు. గోవా నుంచి ఇంత వరకూ ఎవరూ గవర్నర్ కాలేదని, తొలిసారి గోవాకు చెందిన తనకు గవర్నర్‌ పదవి దక్కడం సంతోషంగా ఉందని ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీలో నేతలు, నాయకత్వం కీలకమనడానికి తన నియామకమే నిదర్శనమని అన్నారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆర్లేకర్ ఆ తర్వాత గోవా అసెంబ్లీకి రెండు సార్లు ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌గా, బీజేపీ గోవా యూనిట్ అధ్యక్షుడుగా పనిచేశారు. అర్లేకర్ ముందు హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ పనిచేశారు.

Updated Date - 2021-07-13T17:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising