ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని మేం కూల్చం

ABN, First Publish Date - 2021-12-06T07:17:00+05:30

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2023 ఎన్నికల్లో బీజేపీదే అధికారం: షా

జైపూర్‌, డిసెంబరు 5: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. 2023 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ చేసిన ఆరోపణలకు అమిత్‌ షా ఇలా స్పందించారు. ‘‘ప్రభుత్వం కూలిపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదు. వచ్చే ఎన్నికల్లో మేమే స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తాం’’ అని షా అన్నారు. ఒకప్పుడు ‘గరీబీ హఠావో’ అన్న ఇందిరాగాంధీ.. పేదరికాన్ని నిర్మూలించడానికి బదులు పేదలను మరింత అణగదొక్కారని ఆరోపించారు. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే పేదరిక నిర్మూలన ప్రారంభమయిందని తెలిపారు. 

Updated Date - 2021-12-06T07:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising