ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర,కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్ష తప్పనిసరి

ABN, First Publish Date - 2021-02-26T12:29:31+05:30

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తచర్యగా కఠిన ఆంక్షలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు

జైపూర్ (రాజస్థాన్): దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తచర్యగా కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రాజస్థాన్ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే వారు కొవిడ్-19 పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని రాజస్థాన్ సర్కారు ఆదేశించింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగిటివ్ అని రిపోర్టు వస్తేనే వారిని రాజస్థాన్ రాష్ట్రంలోకి అనుమతిస్తామని సర్కారు ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రానికి వచ్చే మహారాష్ట్ర, కేరళ వాసులు కనీసం వారి రాకకు 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకొని నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని ప్రభుత్వం కోరింది. కరోనా కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళతోపాటు చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అధ్యయనం చేసేందుకు తన బృందాలను పంపించింది.

Updated Date - 2021-02-26T12:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising