ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త రైల్వేమంత్రిని కాలేజీ స్టయిల్‌లో బాస్ అని పిలవాలట!

ABN, First Publish Date - 2021-07-10T12:23:07+05:30

నరేంద్ర మోదీ సర్కారులో కొత్తమంత్రులు కొలువు దీరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారులో కొత్తమంత్రులు కొలువు దీరారు. వీరిలో అశ్వినీ వైష్ణవ్ ఒకరు. ఆయన నూతన రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాలయ పనివేళలు మార్చివేశారు. ఈ సందర్భంలో ఆయన ఒక ఇంజినీరుతో జరిపిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. మంత్రి అశ్వినీ వైష్ణవ్ సిగ్నల్ విభాగానికి చెందిన ఒక ఇంజినీరును కలుసుకున్నారు. ఆ ఇంజినీరు... మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒకే కాలేజీలో చదువుకున్నారు. 


దీంతో మంత్రి ఆ ఇంజినీరుతో పాటు అక్కడున్నవారితో మాట్లాడుతూ... మా కాలేజీలో జూనియర్లు... సీనియర్లను సర్ అని కాకుండా బాస్ అని పిలిచేవారు. అందుకే తనను బాస్ అని పిలవాలని అన్నారు. ఇంట్లో ఎలా పనిచేస్తామో కార్యాలయంలోనూ అలా పనిచేస్తే ఆనందంగా ఉంటుందన్నారు. మంత్రి అశ్వినీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల ఎంబీఎం ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. జోధ్‌పూర్‌లో జన్మించిన అశ్వినీ వైష్ణవ్ 1994 ఐఎఎస్ బ్యాచ్ అధికారి. కాగా అశ్వినీ వైష్ణవ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రైల్వేశాఖలో పనిచేసే అధికారుల పనివేళలను మార్చివేశారు. ఇకపై వారు మూడు షిఫ్టులలో పనిచేయాల్సివుంటుంది.

Updated Date - 2021-07-10T12:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising