ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ఉద్యోగులకు శుభవార్త

ABN, First Publish Date - 2021-10-06T22:29:44+05:30

రైల్వేలో ప్రస్తుతం 11.52 లక్షల మంది నాన్‌-గెజిటెడ్ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఆర్‌పీఎఫ్/ఆర్‌పీఎస్ఎఫ్ ఉద్యోగులను మినహాయించి మొత్తానికి ఈ బోనస్ అందుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ప్రోడక్టివిటీ లింక్‌డ్ బోనస్ పేరిట 1979-80లో ప్రారంభమైన ఈ సంప్రదాయం.. రైల్వేలో నేటికీ కొనసాగుతుండడం విశేషం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి బొనాంజ ప్రకటించింది. మొత్తం 78 రోజుల పని దినాల వేతనాలకు సరిపడే జీతాన్ని ఈ యేడాది దీపావళికి బోనస్‌గా వేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ బుధవారం ప్రకటించారు. అయితే ఇది రైల్వేలో పని చేస్తున్న నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా నాన్-గెజిటెడ్ కేటగిరీలోనే ఉన్న ఆర్‌పీఎఫ్/ఆర్‌పీఎస్ఎఫ్ ఉద్యోగులకు ఇది వర్తించదని తెలిపారు.


రైల్వేలో ప్రస్తుతం 11.52 లక్షల మంది నాన్‌-గెజిటెడ్ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఆర్‌పీఎఫ్/ఆర్‌పీఎస్ఎఫ్ ఉద్యోగులను మినహాయించి మొత్తానికి ఈ బోనస్ అందుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ప్రోడక్టివిటీ లింక్‌డ్ బోనస్ పేరిట 1979-80లో ప్రారంభమైన ఈ సంప్రదాయం.. రైల్వేలో నేటికీ కొనసాగుతుండడం విశేషం. అయితే ఇది గతంలో 72 రోజుల పని వేతనానికి సరిపడా ఉండేది. మోదీ ప్రభుత్వం దీన్ని తాజాగా 78 రోజులకు పెంచడం గమనార్హం.

Updated Date - 2021-10-06T22:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising