ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

vintage steam engine స్క్రాప్‌గా విక్రయానికి రైల్వే ఇంజినీర్ యత్నం...సస్పెండ్

ABN, First Publish Date - 2021-12-22T18:12:36+05:30

బీహార్‌లో పాతకాలపు ఆవిరి ఇంజిన్‌ను అక్రమంగా స్క్రాప్‌గా విక్రయించడానికి ప్రయత్నించిన రైల్వే ఇంజనీర్‌ను రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీహార్‌లో పాతకాలపు ఆవిరి ఇంజిన్‌ను అక్రమంగా స్క్రాప్‌గా విక్రయించడానికి ప్రయత్నించిన రైల్వే ఇంజనీర్‌ను రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పూర్నియా జిల్లాలో ఇంజినీర్ రాజీవ్ రంజన్ ఝాతో పాటు మరో ఆరుగురిపై కూడా కేసు నమోదైంది.సమస్తిపూర్ రైల్వే డివిజన్‌లోని నిందితులను అరెస్టు చేయడానికి, సామగ్రిని రికవరీ చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఏకే లాల్ చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పు మధ్య రైల్వే పరిధిలోని సమస్తిపూర్ డివిజన్ డీఆర్‌ఎం అలోక్ అగర్వాల్ తెలిపారు. 


ప్రజల సందర్శన కోసం పూర్నియాలో ఉంచిన మీటర్ గేజ్ ఇంజన్‌ను డిసెంబరు 14న సుశీల్ యాదవ్ సహాయంతో గ్యాస్ కట్టర్‌తో కట్ చేయడానికి ప్రయత్నించి నిందితుడు దొరికాడు.స్క్రాప్ డీజిల్ షెడ్డుకు చేరలేదని ఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఒక రోజు తర్వాత ఈ రాకెట్ గుట్టు రట్టు అయింది.తదుపరి విచారణలో స్క్రాప్ రవాణా కోసం ఎటువంటి ఆర్డర్ జారీ చేయలేదని, లేఖ నకిలీదని తేలింది.పోలీసులు ఇంకా మెటీరియల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.


Updated Date - 2021-12-22T18:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising