ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ ఓ టూరిస్ట్ లీడర్ : అమిత్‌షా ఎద్దేవా

ABN, First Publish Date - 2021-04-16T20:18:25+05:30

బెంగాల్‌లో అక్రమ చొరబాటు దార్లకు అడ్డకట్ట వేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అక్రమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : బెంగాల్‌లో అక్రమ చొరబాటు దార్లకు అడ్డకట్ట వేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అక్రమ చొరబాటుదార్లు యువకుల ఉపాధి అవకాశాలపై, ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ అక్రమ చొరబాటుదార్లను కట్టడి చేయకపోతే కేవలం బెంగాల్‌కే ప్రమాదం కాదని, దేశానికే ప్రమాదమని హెచ్చరించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌షా శుక్రవారం బెంగాల్‌లోని తెహట్టాలో పర్యటించారు. 70 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి, కొందరు శరణార్థి జీవితాలను గడుపుతున్నారని, వారికి పౌరసత్వం ఇవ్వడానికి తాము కృషి చేస్తోందని వివరించారు. వారికి కోసం 100 కోట్ల రూపాయల ఫండ్‌ను ఏర్పాటు చేశామని, వారికి పౌరసత్వం కూడా ఇస్తామని ప్రకటించారు. మథువాలకు, నంశుద్రాలతో పాటు ఇతర వర్గాలకు పౌరసత్వం ఇవ్వరా? అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నంత వరకూ వారికి పౌరసత్వం ఇవ్వడం కుదరదని ఆమె పేర్కొన్నారని గుర్తు చేశారు. తాము వారందరకీ పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు పంటలను బ్రహ్మాండంగా పండిస్తున్నారని, అయితే వాటిని దాచడానికి గోదాంలు లేవని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే గోదాములను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 


రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు


ఈ ర్యాలీ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఓ టూరిస్ట్ లీడర్ ఉన్నారంటూ రాహుల్‌ను ఎద్దేవా చేశారు. ‘‘దేశంలో ఓ టూరిస్ట్ నేత ఉన్నారు. ఎన్నికలకు సంబంధించిన చాలా దశలు ముగిసిపోయాయి. కానీ రాహుల్ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ఒకే ఒక ర్యాలీ నిర్వహించారు. బీజేపీ డీఎన్‌ను ప్రశ్నిస్తున్నారు. మా డీఎన్‌ను గురించి మీరు అడగకండి. అభివృద్ధి, జాతీయత, ఆత్మనిర్భర భారత్‌‌తో కూడిన డీఎన్‌ఏ మాది’’ అని అమిత్‌షా ఘాటుగా రాహుల్‌కు కౌంటర్ ఇచ్చారు. 


Updated Date - 2021-04-16T20:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising