ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విధ్వంసకర విధానంతో మూడో ప్రభంజనం తప్పదు : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2021-05-16T00:24:46+05:30

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు సమగ్రమైన జాతీయ విధానాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు సమగ్రమైన జాతీయ విధానాన్ని రూపొందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర వ్యాక్సినేషన్ విధానం వల్ల ఈ మహమ్మారి మూడో ప్రభంజనం ఖాయమని చెప్పారు. గంగా నదిలో కోవిడ్ బాధితులవిగా అనుమానించదగిన శవాలు కనిపిస్తుండంపై స్పందిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంగా మాతను ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత ప్రభుత్వం విధ్వంసకర వ్యాక్సినేషన్ విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. దీనివల్ల అత్యంత దారుణమైన మూడో ప్రభంజనం తప్పదని హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగినది చాలని, అలా మళ్లీ జరగకూడదని అన్నారు. భారత దేశానికి సరైన వ్యాక్సినేషన్ విధానం అవసరమని చెప్పారు. 


1140 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రవహిస్తున్న గంగా నదిలో 2,000కుపైగా మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు తెలిపే మీడియా కథనాన్ని ఈ ట్వీట్‌కు రాహుల్ గాంధీ జత చేశారు. గంగమ్మ తల్లి తనను పిలిచిందని చెప్పుకునే వ్యక్తి నేడు ఆ గంగా మాతను ఏడిపిస్తున్నారని దుయ్యబట్టారు. 


టౌక్టే తుపాను ప్రభావిత రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆయన మరొక ట్వీట్‌లో కోరారు. అవసరంలో ఉన్నవారికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా సాయడాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. కేరళ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలపై టౌక్టే తుపాను ప్రభావం ఉంటుందని, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-16T00:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising