ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరూ టీకాలు వేయించుకోవాలి : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2021-06-15T18:21:12+05:30

సాధ్యమైనంత త్వరగా కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రజలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సాధ్యమైనంత త్వరగా కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, టీకాలు తీసుకున్న తర్వాత భద్రతాపరమైన మార్గదర్శకాలను అన్ని విధాలుగా పాటించాలని కోరారు. అన్‌లాకింగ్ జరుగుతోందని, అయితే కరోనా వైరస్ మనతోనే ఉంటుందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. అందరూ సురక్షితంగా లేకపోతే ఏ ఒక్కరూ క్షేమంగా ఉండలేరన్నారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. ప్రజలంతా తమ పట్ల తాము శ్రద్ధవహించాలని చెప్పారు. 


ఇదిలావుండగా, మన దేశంలో 75 రోజుల తర్వాత అతి తక్కువ కోవిడ్-19 కేసులు (60,471) సోమవారం నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.45 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు 25,90,44,072 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 


Updated Date - 2021-06-15T18:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising