ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెల్టా వైరస్ వ్యాప్తి నిరోధానికి విస్తృత స్థాయి పరీక్షలేవీ? : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2021-06-25T19:51:58+05:30

కోవిడ్-19కు చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19కు చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. ఈ వేరియంట్‌పై ప్రస్తుత వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తాయో, లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 


రాహుల్ గాంధీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో డెల్టా ప్లస్ వేరియంట్‌పై మోదీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఈ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలను ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. దీనిని ఎదుర్కొనడంలో వ్యాక్సిన్ల సమర్థత ఏమిటో చెప్పాలని కోరారు. దీనిపై సంపూర్ణ సమాచారం ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పాలన్నారు. ఈ వైరస్ మూడో ప్రభంజనంలో దీనిని నియంత్రించేందుకు రూపొందించిన ప్రణాళిక ఏమిటని అడిగారు. 


కోవిడ్-19లో ఓ రూపాంతరం డెల్టా ప్లస్. ఇది వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీనిపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇది ఆందోళనకరమైన వైరస్ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2021-06-25T19:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising