ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi: RSS వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

ABN, First Publish Date - 2021-07-16T22:13:47+05:30

కాంగ్రెస్ నేతలకు తలుపులు తెరిచే ఉన్నాయని, ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని అన్నారు. ఇక కాంగ్రెస్‌కు బలం భయంలేని నేతలేనని, పార్టీ బయట కూడా అలాంటి నేతలు చాలా మంది ఉన్నారని, వారిని పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలం ఉన్న నేతలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం జూమ్ ద్వారా నిర్వహించిన సోషల్ మీడియా విభాగం కార్యక్రమంలో రాహుల్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సంఘ్ భావజాలం ఉన్న కాంగ్రెస్ నేతలకు తలుపులు తెరిచే ఉన్నాయని, ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని అన్నారు. ఇక కాంగ్రెస్‌కు బలం భయంలేని నేతలేనని, పార్టీ బయట కూడా అలాంటి నేతలు చాలా మంది ఉన్నారని, వారిని పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన అన్నారు.


‘‘ఇక్కడ చాలా మంది ధైర్యవంతులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ బయట ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి వెంటనే పార్టీలోకి తీసుకురావాలి. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా భారతీయ జనతా పార్టీకి భయపడేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి తలుపులు తెరిచే ఉంటాయి. అలాంటి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయటికి వెళ్లాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలం ఉన్న నేతలు మాకు అవసరం లేదు. అలాంటి వారు కూడా పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిది. మాకు ధైర్యవంతులు కావాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Updated Date - 2021-07-16T22:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising