ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruvannamalai రథం దిగువ శిలాశాసనం

ABN, First Publish Date - 2021-12-01T16:29:34+05:30

తిరువణ్ణామలైలో ఆలయ సమీపంలోని మురుగన్‌ కొయ్య రథం దిగువన ఓ శిలాశాసనం ఉండటాన్ని పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఆ రథం నేలపై ఒరిగిపోకుండా ఓ రాతిని ఆసరాగా నిలబెట్టారు. అయితే ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తిరువణ్ణామలైలో ఆలయ సమీపంలోని మురుగన్‌ కొయ్య రథం దిగువన ఓ శిలాశాసనం ఉండటాన్ని పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఆ రథం నేలపై ఒరిగిపోకుండా ఓ రాతిని ఆసరాగా నిలబెట్టారు. అయితే ఆ రాతిపై ప్రాచీన తమిళ అక్షరాలను చెక్కబడి ఉండటాన్ని యేళ్లతరబడి గమనించలేదు. ఈ నేపథ్యంలో పురావస్తు పరిశోధకులు రాజ్‌పన్నీర్‌సెల్వం, ఆయన సహాయకులు బాలాజీ, శంకర్‌, ఉదయరాజా ఇటీవల తిరువణ్ణామలై ఆలయం వద్ద జరిగిన మహా కార్తీక దీపోత్సవాల వివరాలను సేకరించారు. ఆ సమయంలో మాఢవీధిలోని మురుగన్‌ రథం దిగువనున్న రాతిని నిశితంగా పరిశీలించారు. ఆ రాతి శుభ్రం చేయగా దానిపై ప్రాచీన తమిళ అక్షరాలుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రాయి 12 శతాబ్దానికి చెందిన శిలాశాసనమని గుర్తించారు. ఆ రాతిపై ‘స్వస్తిశ్రీ నల్లూరాన్‌ విలక్కన్‌ తిరుచిట్రంబలం’ అని ప్రాచీన తమిళ అక్షరాలు చెక్కబడి ఉంది. నల్లూరు అనేది ఓ ఊరి పేరై ఉంటుందని, తిరుచిట్రంబలం’ అనేది వ్యక్తి పేరై ఉంటుందని పురావస్తు పరిశోధకులు రాజ్‌పన్నీర్‌సెల్వం తెలిపారు. ప్రాచీన కాలంలో ఓ స్తంభాన్ని నిర్మించేందుకు ఆ రాతిని తిరుచిట్రబలం దానంగా ఇచ్చి ఉంటాడని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-12-01T16:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising