ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Queenslandలో వెలుగుచూసిన కరోనా ఒమైక్రాన్ కొత్త వెర్షన్ వైరస్

ABN, First Publish Date - 2021-12-09T12:49:23+05:30

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో కరోనా ఒమైక్రాన్ కొత్త వెర్షన్ వైరస్ వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వీన్స్‌లాండ్(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో కరోనా ఒమైక్రాన్ కొత్త వెర్షన్ వైరస్ వెలుగుచూసింది.ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందిన దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రానికి వచ్చిన ఒక ప్రయాణికుడిలో కొత్త ఒమైక్రాన్ వెర్షన్‌ను గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.కొత్త ఒమైక్రాన్ వెర్షన్‌లో సగం జన్యు వైవిధ్యాలున్నాయని, దీన్నిసాధారణ స్క్రీనింగ్‌తో గుర్తించలేమని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర యాక్టింగ్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ పీటర్ ఐట్‌కెన్ వెల్లడించారు. కొత్త వెర్షన్ వైరస్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిలో కనుగొన్నామని పీటర్ పేర్కొన్నారు.


ఒమైక్రాన్ వేరియంట్ 57 దేశాల్లో వ్యాప్తి చెందుతుందని,ఈ వేరియెంట్ వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమైక్రాన్ డెల్టా వేరియెంట్ కంటే తీవ్రత తక్కువగా ఉన్నా ఎక్కువ మందికి ఈ వైరస్ సోకితే ఆసుపత్రుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది. 


Updated Date - 2021-12-09T12:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising