ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనిక విమానంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2021-11-16T22:20:01+05:30

ఉత్తరప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై  ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైనిక విమానంలో ల్యాండ్ కావడం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. సుల్తాన్‌పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరి వద్ద మోదీ ప్రయాణించిన సి-130 హెర్క్యులస్ సైనిక రవాణా విమానం ల్యాండ్ అయింది. 340 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ జాతీయ రహదారితో లక్నో-ఘజీపూర్ మధ్య ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గిపోనుంది. 


సంక్లిష్ట పరిస్థితుల్లో యుద్ధ, రవాణా కార్యకలాపాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించేలా తీర్చిదిద్దిన ఈ ఎక్స్‌ప్రెస్ హైవేని ప్రధాని ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. పూర్వాంచల్ ప్రజలకు ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి విషయంలో యూపీపై ఉన్న అపోహలు ఇప్పుడు పటాపంచలు అయ్యాయన్నారు. విమర్శకులు ఒకసారి ఇటువైపు తొంగి చూడాలని చురకలు అంటించారు. 



Updated Date - 2021-11-16T22:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising