ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంతం నెగ్గించుకున్న సిద్ధూ..కొత్త ఏజీ నియామకం

ABN, First Publish Date - 2021-11-20T02:30:15+05:30

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్ర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్ర కొత్త అడ్వకేట్ జనరల్‌గా సీినియర్ అడ్వకేట్ దీపిందర్ సింగ్ పట్వాలియాను పంజాబ్ ప్రభుత్వం నియమించింది. సిద్ధూ సానుకూలత వ్యక్తం చేయడంతోనే కొత్త ఏజీగా పట్వాలియా నియామకం జరిగినట్టు ఏజీ వర్గాలు తెలిపాయి.


ఏపీఎస్ డియోల్ ఈనెల 9న అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. మొదట్నించీ డియోల్ నియాకమకాన్ని సిద్ధూ వ్యతిరేకిస్తూ వచ్చారు. తన డిమాండ్‌పై కొద్దిరోజుల క్రితం పీపీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. ఆ తర్వా మెత్తబడి తాన రాజీనామాను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. అయితే, కొత్త అడ్వకేట్ జనరల్ నియామకం జరిగి, కొత్త ప్యానల్ వచ్చిన తర్వాతే తాను విధుల్లోకి వస్తానని తేల్చిచెప్పారు.  2015లో అప్పటి అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై కాల్పులు, మతపరమైన ఘటనలకు సంబంధించిన కేసుల్లో నిందితులైన మాజీ డీజీపీ సుమేథ్ సైనీ, మరో పోలీసు అధికారి తరఫున డియోల్‌ వాదించారు. అలాంటి డియోల్‌ను అడ్వకేట్ జనరల్‌గా నియమించడం ఏమిటని ప్రశ్నించిన సిద్ధూ, ఎట్టకేలకు ఆయనకు ఉద్వాసన చెప్పించడం ద్వారా పంతం నెగ్గించుకున్నారు.

Updated Date - 2021-11-20T02:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising