ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకంపై కెప్టెన్ అమరీందర్ ట్వీట్

ABN, First Publish Date - 2021-10-11T22:22:25+05:30

పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో ఐదుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందడంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో ఐదుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందడంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ తర్వాత కశ్మీర్‌లో పాక్‌ప్రేరిత తాలిబన్ల ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వాపోయారు. కశ్మీర్‌లో భయాలన్నీ నిజమౌతున్నాయన్నారు.


కశ్మీర్‌లో ఇటీవల లష్కర్ ఎ తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు. ముస్లిమేతరులైన సిక్కులను, హిందువులను కాల్చి చంపుతున్నారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు భారతీయ సైన్యం అప్రమత్తమైంది. పీఓకే నుంచి ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి పూంచ్ జిల్లా సురాన్‌కోట్ వద్ద భారత్‌లోకి ప్రవేశించారనే సమాచారంతో సైన్యం కూంబింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారితో పాటు మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. 

Updated Date - 2021-10-11T22:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising