ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండో-పాక్ సరిహద్దుల్లో BSF అధికార పరిధి పొడిగింపు

ABN, First Publish Date - 2021-10-14T13:39:46+05:30

ఇండో-పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ అధికార పరిధిని పొడిగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పంజాబ్ సీఎం కేంద్రాన్ని కోరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించిన పంజాబ్ సీఎం

చండీఘడ్ (పంజాబ్): ఇండో-పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ అధికార పరిధిని పొడిగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పంజాబ్ సీఎం కేంద్రాన్ని కోరారు.పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని అంతర్జాతీయ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం యొక్క అధికార పరిధిని 50 కిలోమీటర్ల బెల్ట్ వరకు పొడిగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ ట్విట్టర్‌లో ఖండించారు.ఇంతకుముందు బీఎస్ఎఫ్ యొక్క అధికార పరిధి సరిహద్దు వెంబడి 15 కిలోమీటర్ల బెల్ట్ వరకు ఉండేది.కేంద్ర ప్రభుత్వ చర్యను ఫెడరలిజంపై ప్రత్యక్ష దాడి అని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం ఛన్నీ కోరారు.


‘‘అంతర్జాతీయ సరిహద్దుల వెంట 50 కిలోమీటర్ల బెల్ట్ లోపల బీఎస్ఎఫ్ బలగాలకు అదనపు అధికారాలు ఇవ్వాలనే కేంద్రప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది సమాఖ్యవాదంపై ప్రత్యక్ష దాడి. ఈ అహేతుక నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నేను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరుతున్నాను.’’ అని సీఎం చరణ్ జీత్ ట్వీట్ లో కోరారు.పంజాబ్ ఉప ముఖ్యమంత్రి ఎస్ సుఖ్జీందర్ సింగ్ రాంధవా కూడా కేంద్రం చర్యను విమర్శిస్తూ అమిత్ షా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2021-10-14T13:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising