ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం ఆగ్రహం

ABN, First Publish Date - 2021-10-18T20:47:30+05:30

పంజాబ్‌ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలికి బీఎస్‌ఎఫ్‌కు అధికార పరిధిని పెంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పంజాబీలను అసంతృప్తికి గురి చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: భారత సరిహద్దు దళాల (బీఎస్‌ఎఫ్) అధికార పరిధిని పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలికి అనుమతి ఇవ్వడంపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై పంజాబ్ ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్యని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చన్నీ డిమాండ్ చేశారు. సోమవారం పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.


‘‘పంజాబ్‌ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలికి బీఎస్‌ఎఫ్‌కు అధికార పరిధిని పెంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పంజాబీలను అసంతృప్తికి గురి చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా కేంద్రం ఏక పక్షంగా వ్యవహరిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’’ అని చన్నీ అన్నారు.

Updated Date - 2021-10-18T20:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising