ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రశంసించిన పంజాబ్ సీఎం

ABN, First Publish Date - 2021-01-16T21:49:38+05:30

రోనా వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలో ప్రారంభం కావడంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలి: కరోనా వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలో ప్రారంభం కావడంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఎలాంటి భయాలు లేవన్నారు. అల్పాదాయ వర్గాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖ రాసినట్టు చెప్పారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ , వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తొలుత హెల్త్ వర్కర్లతో ప్రారంభించి క్రమంగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అల్పాదాయ వర్గాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రధానికి రాసిన లేఖలో తాను కోరినట్టు చెప్పారు.


కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని, భయాలు అవసరమే లేదని అమరీందర్ సింగ్ అన్నారు. 'వ్యాక్సిన్ సురక్షితమని శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతున్నారు. 93 ఏళ్ల వయసున్న ఇంగ్లాండ్ రాణి వ్యాక్సిన్ తీసుకున్నారు. 99 ఏళ్ల ఆమె భర్త కూడా టీకా వేయించుకున్నారు. ఇంక భయాలకు తావేముంది? భయాలు అక్కర్లేదు' అని కెప్టెన్ అన్నారు. దేశంలో తొలి విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా 3 కోట్ల మంది హెల్త్‌వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. పంజాబ్‌కు 2,04,500 డోస్‌ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చింది. రాబోయే ఐదు రోజుల్లో రోజుకు 40,000 మంది చొప్పున 1.74 లక్షల హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వర్చువల్ మీట్ ద్వారా ప్రారంభించారు.

Updated Date - 2021-01-16T21:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising