ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించిన సీఎం

ABN, First Publish Date - 2021-11-07T21:17:25+05:30

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు ఇంధన ధరలను తగ్గిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. కాగా తాజాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లో ఇంధన ధరలు భారీగా తగ్గించారు. పెట్రోల్‌పై పది రూపాయలు, డీజిల్‌పై ఐదు రూపాయలు తగ్గిస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆదివారం ప్రకటించారు. తగ్గించిన ఈ ధరలు ఈరోజు అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.


వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు ఇంధన ధరలను తగ్గిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి చాలా రోజులుగా దేశంలో ఇంధన ధరలు తీవ్ర స్థాయికి పెరిగిపోయాయి. ఈ విషయమై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఎన్నికల్లో ప్రభావితం కానుందని భావించిన పాలకులు ఇంధన ధరల్ని తగ్గించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2021-11-07T21:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising