ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై ఆర్‌పీఎఫ్ కేసుల ఎత్తివేతకు సీఎం ఆదేశం

ABN, First Publish Date - 2021-10-02T21:52:00+05:30

మూడు వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: మూడు వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల విజ్ఞప్తి చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని శనివారంనాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్నాల సందర్భంగా రైల్వే ట్రాకులపై బైఠాయించిన రైతు సంస్థల సభ్యులపై ఆర్‌పీఎఫ్ నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కిసాన్ సంస్థల సభ్యులపై ఆర్‌పీఎఫ్ నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని రైల్వే బోర్డు చైర్మన్‌ను సీఎం కోరారు. ఈ మేరకు ఆర్‌పీఎఫ్‌కు సీఎం లేఖ కూడా రాశారు.


ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారంనాడు ఢిల్లీలో కలిసిన మరుసటి రోజే పంజాబ్ సీఎం తాజా ఆదేశాలు జారీ చేయడం విశేషం. తమ సమావేశంలో రైతు సమస్యలు చర్చకు రావడంతో పాటు, మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్టు చన్నీ శుక్రవారంనాడు మీడియాకు తెలిపారు. ప్రధాని ఎంతో ఓపిగ్గా తాను చెప్పినది విన్నారనీ, సమస్యకు పరిష్కారం జరగాలని ప్రధాని కూడా కోరుకుంటున్నారని చెప్పారు. చర్చలు పునరుద్ధరించాలని తాను ప్రధానిని కోరినట్టు సీఎం వివరించారు.

Updated Date - 2021-10-02T21:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising