ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానమంత్రిని కలిసిన పంజాబ్ సీఎం

ABN, First Publish Date - 2021-10-02T00:10:29+05:30

ప్రధానితో సమావేశం అనంతరం మీడియాతో సీఎం చన్నీ మాట్లాడుతూ ‘‘రైతులతో సంప్రదింపులు జరిపి ఆందోళన పరిష్కరించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరాను. అలాగే కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కలుసుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో శుక్రవారం వీరి కలయికకు వేదికైంది. తాను ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి ప్రధానిని కలుస్తున్నందుకు గుర్తుగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ జ్ణాపికను ప్రధానికి చన్నీ అందజేశారు. అనంతరం వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన సహా పంజాబ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు సీఎం చన్నీ పేర్కొన్నారు.


ప్రధానితో సమావేశం అనంతరం మీడియాతో సీఎం చన్నీ మాట్లాడుతూ ‘‘రైతులతో సంప్రదింపులు జరిపి ఆందోళన పరిష్కరించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరాను. అలాగే కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశాను. అలాగే కోవిడ్ మహమ్మారి కారణంగా మూసేసిన కర్తార్‌పూర్ కారిడాన్‌ను మళ్లీ తెరవాలని విజ్ణప్తి చేశాను’’ అని అన్నారు.

Updated Date - 2021-10-02T00:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising