ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలపై మోదీని కలిసిన పంజాబ్ బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2021-11-14T19:01:20+05:30

వచ్చే ఏడాది ప్రథమార్థంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఆ రాష్ట్ర బీజేపీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రథమార్థంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆదివారంనాడు కలుసుకున్నారు. రైతు నిరసనలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, కర్తార్‌పూర్ కారిడార్ తదతర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు పార్ట వర్గాల ద్వారా తెలిసింది. బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు అశ్విన్ కుమార్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హర్జీత్ సింగ్ గ్రెవల్ ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం.


దీనికి ముందు, నవంబర్ 7న అశ్విన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 117 సీట్లలోనూ పోటీ చేస్తుందని చెప్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించింది. దీంతో సాద్-బీజేపీ కూటమి పదేళ్ల పాలనకు తెరపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లు గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లకు, బీజేపీ 3 సీట్లకు పరిమితమయ్యాయి.

Updated Date - 2021-11-14T19:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising