ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్ధూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ పంజాబ్ ఏజీ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-11-07T00:22:22+05:30

పంజాబ్ అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ శనివారం కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ శనివారం కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


పంజాబ్ పీసీసీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన సిద్ధూ నిన్న తన నిర్ణయం మార్చుకున్నారు. తాను తిరిగి బాధ్యతలు చేపడతానని, అయితే, అంతకంటే ముందు డీజీపీ సహోటా, ఏజీ డియోల్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు.


ఈ నేపథ్యంలో డియోల్ తాజా వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ సహచరులపై పైచేయి సాధించేందుకు సిద్ధూ నిరాధార, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రభుత్వ, ఏజీ పనితీరు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు.


సిద్ధూ పదేపదే చేస్తున్న ఆరోపణలు డ్రగ్స్ వ్యవహారం, బలిదానాల కేసుల్లో న్యాయం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని డియోల్ ఆరోపించారు. సహోటా, డియోల్ రాజీనామా డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 28న సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.

Updated Date - 2021-11-07T00:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising