ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా స్కూళ్లు తెరిచారు... అలా కరోనా పట్టేసుకుంది!

ABN, First Publish Date - 2021-08-11T11:42:59+05:30

పంజాబ్‌లో ఇలా స్కూళ్లు తెరిచారోలేదో... కొందరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్‌లో ఇలా స్కూళ్లు తెరిచారోలేదో... కొందరు విద్యార్థులకు కరోనా సోకింది. లుధియానాలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ, విద్యాశాఖలో కలకలం చెలరేగింది. పాజిటివ్‌గా తేలిన విద్యార్థులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. 


పంజాబ్‌లోని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఆగస్టు రెండు నుంచి అన్ని స్కూళ్లను తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే ఇప్పుడు 20 మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో పరిస్థితిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికితోడు ఇటీవలి కాలంలో కరోనాకు సంబంధించిన వివిధ వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు అవలంబించింది. ఆగస్టు 22 వరకూ రాష్ట్రంలోని స్కూళ్లను తెరవకూడదని నిర్ణయం తీసుకుంది. ఇదేవిధంగా పలు రాష్ట్రాలు విద్యాసంస్థలను తెరిచేందుకు వెనుకడుగు వేస్తున్నాయి.

Updated Date - 2021-08-11T11:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising