ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ ప్రేమికుడికి సీపీ రిప్లై.. నెటిజెన్లు ఫిదా

ABN, First Publish Date - 2021-03-09T21:12:23+05:30

ఇందులో నెటిజెన్లు వేసిన పలు రకాల ప్రశ్నలకు పూణె సీపీ అమితాబ్ గుప్తా సమాధానాలు చెప్పుకొచ్చారు. అయితే ఓ వ్యక్తికి ఇచ్చిన రిప్లై నెటిజెన్లను అమితంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: ట్విట్టర్‌లో ‘ఆస్క్ మీ’ (ట్విట్టర్ వేదికగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు) అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఆదరణ పొందింది. తమ గురించి కానీ, వేరే ఇతర విషయంపై గాని నెటిజెన్లు అడిగే ప్రశ్నలకు అక్కడే సమాధానం చెప్తుంటారు. సినిమా, రాజకీయా, క్రీడా రంగాలతో పాటు ఇతర రంగాల్లోకి ప్రముఖులు.. నెటిజెన్లతో మమేకం అయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉపయోగపడుతుండడంతో వీటిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు.


తాజాగా పూణె పోలీస్ కమిషనర్ ‘‘లెట్స్ టాక్ సీపీ పూణె సిటీ’’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ వేదికగా సోమవారం ‘ఆస్క్ మీ’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో నెటిజెన్లు వేసిన పలు రకాల ప్రశ్నలకు పూణె సీపీ అమితాబ్ గుప్తా సమాధానాలు చెప్పుకొచ్చారు. అయితే ఓ వ్యక్తికి ఇచ్చిన రిప్లై నెటిజెన్లను అమితంగా ఆకట్టుకుంది. దీంతో సీపీ అమితాబ్ గుప్తాపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంచి సమాధానం ఇచ్చారని పొగుతున్నారు.


ఓ నెటిజెన్.. తాను ప్రేమిస్తున్న యువతి తన ప్రేమను అంగీకరించడం లేదని, దాని కోసం ఏదైనా చేయమని కమిషనర్‌ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ ‘‘దురదృష్టవషాత్తూ, ఆమె అంగీకారం లేకుండా మేము ఎలాంటి సహాయమూ చేయలేము. మీరు కూడా ఆమెకు ఇష్టంలేని పనులు చేయొద్దు. ఏమో ఏదో ఒకరోజు ఆమె మీ ప్రేమను అంగీకరించవచ్చు. అందుకు ముందుగానే మా తరపున మీకు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాము’’ అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌కి ‘నో మీన్స్ నో’ అని అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.

Updated Date - 2021-03-09T21:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising