పుదుచ్చేరి సీఎస్‌కు Highcourt వారెంట్
ABN, First Publish Date - 2021-12-12T16:13:26+05:30
న్యాయస్థానం ఉత్తర్వుల ఉల్లంఘన కేసులో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మద్రాసు హైకోర్టు వారెంట్ జారీచేసింది. పుదుచ్చేరి రాష్ట్రప్రభుత్వ తాగునీటి వినియోగం, కూరగాయల విక్రయ సంస్థలో పనిచేస్తున్న 48 మంది వేతన
పుదుచ్చేరి: న్యాయస్థానం ఉత్తర్వుల ఉల్లంఘన కేసులో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మద్రాసు హైకోర్టు వారెంట్ జారీచేసింది. పుదుచ్చేరి రాష్ట్రప్రభుత్వ తాగునీటి వినియోగం, కూరగాయల విక్రయ సంస్థలో పనిచేస్తున్న 48 మంది వేతన బకాయిలకు సంబంధించి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం మూడు నెలల్లో బకాయిలు చెల్లించాలని గత జూలైలో ఉత్తర్వులు జారీచేసింది. కానీ, వేతన బకాయిలు చెల్లించకపోవడంతో బాధిత కార్మికులు న్యాయస్థానం ఉత్తర్వుల ఉల్లంఘన కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్వినికుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రవి ప్రకాష్, డైరెక్టర్ బాలభారతిలకు నోటీసులు జారీచేయగా, అన్నిశికుమార్ మినహా మిగిలిన వారు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. దీంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశ్వినికుమార్‌కు వారెంట్ జారీచేస్తూ న్యాయమూర్తి దండపాణి ఉత్తర్వులు జారీచేశారు.
Updated Date - 2021-12-12T16:13:26+05:30 IST