ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi సరిహద్దుల నుంచి స్వస్థలాలకు బయలుదేరిన రైతులు

ABN, First Publish Date - 2021-12-11T15:55:03+05:30

ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా నిరసనలు చేపట్టిన రైతులు తమ నిరసనను శనివారం విరమించుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా నిరసనలు చేపట్టిన రైతులు తమ నిరసనను శనివారం విరమించుకున్నారు.వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వేలాది మంది రైతులు గతేడాది నవంబర్‌లో సింగు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దులను ముట్టడించారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వివాదాస్పద చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. ఏడాదిపాటు ఆందోళన చేసిన రైతులు టెంట్లను తొలగించి ఇళ్లకు బయలుదేరే ముందు సంబరాలు చేసుకున్నారు.రైతులు మొత్తం ఖాళీ చేయడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుందని, తాను డిసెంబరు 15వతేదీన ఇంటికి బయలు దేరుతానని రైతు నేత రాకేష్ తికాయత్ చెప్పారు. 


రైతుల నిరసన శిబిరంలో టార్పాలిన్లు, తాళ్లు, దుప్పట్లు, దిండ్లు, పరుపులు, కుర్చీలు పడి ఉన్నాయి. రైతులు తమ వస్తువులను గ్రామాల్లోని పేదలకు ఇచ్చి స్వగ్రామాలకు ట్రాక్టర్లలో బయలు దేరారు. రంగురంగుల లైట్లతో విజయగీతాలు పాడుకుంటూ రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు.ఘాజీపూర్ సరిహద్దు వద్ద రైతులు ఇళ్లకు బయలుదేరిన ట్రాక్టర్లకు రాకేష్ తికాయత్ పచ్చజెండా ఊపారు.


Updated Date - 2021-12-11T15:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising