ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ‌హ‌బూబా తీరును వ్య‌తిరేకిస్తూ జ‌మ్మూలో ఆందోళ‌న‌లు

ABN, First Publish Date - 2021-06-24T16:46:28+05:30

జమ్మూ కాశ్మీర్ అంశంపై చ‌ర్చించే విష‌యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగ‌ర్‌: జమ్మూక‌శ్మీర్ అంశంపై చ‌ర్చించే విష‌యంలో పాకిస్థాన్‌ను కూడా భాగ‌స్వామిగా చేయాల‌ని మెహబూబా ముఫ్తీ చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జమ్మూలో నిరసనలు మొద‌ల‌య్యాయి. ఈరోజు డోగ్రా ఫ్రంట్ అనే సంస్థ స‌భ్యులు జమ్మూలోని వీధుల్లోకి వచ్చి, మ‌హబూబా ముఫ్తీకి వ్యతిరేకంగా నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. ఇలా వ్యాఖ్యానించినందుకు మ‌హబూబాను జైలుకు త‌ర‌లించాల‌ని నిరసనకారులు డిమాండ్ చేశారు.


పీడీపీ నేత‌, జమ్మూక‌శ్మీర్ మాజీ సీఎం మ‌హబూబా ముఫ్తీ ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ రోజు ఆమె కాశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సార‌ధ్యంలో జ‌రిగే సమావేశంలో పాల్గొన‌నున్నారు. ఆమెతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ నేత‌ ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత‌లు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన‌నున్నారు.జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్నివ్య‌తిరేకించిన‌ గుప్కర్ కూటమి నాయకులు కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు అంగీక‌రించారు. ఈ సమావేశానికి ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన‌ 14 మంది నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.


Updated Date - 2021-06-24T16:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising