ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కాట్‌లాండ్‌లో స్వతంత్ర అనుకూల పార్టీ ఘన విజయం

ABN, First Publish Date - 2021-05-09T23:44:48+05:30

స్వాతంత్ర్య అంశంపై చాలా కాలంగా బ్రిటన్ ప్రభుత్వం స్కాట్లాండ్ మధ్య అనేక యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2014లో ఇదే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ పెట్టగా బ్రిటన్‌లో కలిసి ఉండేందుకే ఎక్కువ మంది మద్దతు ఇచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: యూనైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక దేశమైన స్కాట్లాండ్‌లో స్వతంత్ర అనుకూల పార్టీ ఘన విజయం సాధించింది. తాజాగా స్కాట్‌లాండ్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో స్కాట్‌లాండ్ మొదటి మంత్రి నికోలా స్టర్జన్ నేతృత్వంలోని స్కాటిష్ నేషనల్ పార్టీ విజయం సాధించింది. దీంతో స్కాట్లాండ్ స్వాతంత్ర్యంపై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో రాజకీయంగా, చట్టబద్ధంగా పోరాడేందుకు మార్గం మరింత సుగమమైందని అంటున్నారు.


ఈ విషయమై స్కాట్లాండ్ మంత్రి నికోలా స్టర్జన్ మాట్లాడుతూ ‘‘ఈ విజయం మాకు మరింత బలాన్ని పెంచింది. కోవిడ్ మహమ్మారి అంతం కాగానే స్కాట్లాండ్ స్వాతంత్ర్యంపై రెండవసారి రెఫరెండం జారీ చేస్తాం. అయితే ప్రజావిశ్వాసాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లెక్కచేయరనే విషయం తెలుసు. బోరిస్‌తో పాటు అంతకు ముందు ప్రధానులు కూడా స్కాట్లాండ్ ప్రజల పట్ల ఇదే విధంగా వ్యవహరించారు. ఇక్కడి ప్రజల భవిష్యత్‌పై దెబ్బ కొడుతూనే వచ్చారు’’ అని అన్నారు.


చాలా కాలంగా బ్రిటన్ ప్రభుత్వం స్కాట్లాండ్ మధ్య అనేక యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2014లో ఇదే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ పెట్టగా బ్రిటన్‌లో కలిసి ఉండేందుకే ఎక్కువ మంది మద్దతు ఇచ్చారు. దీనిని సాకుగా చూపిస్తూ ప్రస్తుతం చర్చలే అనవసరం అన్న తీరుగా బోరిస్ వ్యవహరిస్తున్నారని స్టర్జన్ విమర్శిస్తున్నారు. 314 ఏళ్లుగా యూనైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ దేశం భాగమై ఉంది. అయితే ఈ అంశంపై ప్రజా మద్దతు తమకే ఉందని స్కాటిష్ ప్రభుత్వం వాదిస్తుండగా చట్టాలు తమ వద్ద ఉన్నాయని బ్రిటన్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక నిర్ణయం కోర్టులోనే తేలనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-05-09T23:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising