ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు మృతులకు నివాళులర్పించిన ప్రియాంక

ABN, First Publish Date - 2021-10-12T21:10:50+05:30

అఖింపూర్ ఖేరి హింసాత్మక ఘనటలో మరణించిన రైతులకు కాంగ్రెస్ నేత ప్రియాంక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: అఖింపూర్ ఖేరి హింసాత్మక ఘనటలో మరణించిన రైతులకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా నివాళులర్పించారు. లఖింపూర్ ఖేరిలో మంగళవారం జరిగిన 'అంతిమ ప్రార్థన'లకు ఆమె హాజరయ్యారు. ఆమెతో పాటు, రాష్ట్రీయ లోక్‌ దళ్ చీఫ్ జయంత్ చౌదరి, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైతులు పాల్గొన్నారు. అంతిమ ప్రార్థనల నేపథ్యంలో లఖింపూర్ ఖేరిలో మంగళవారంనాడు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తారు.


రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు

కాగా, లఖింపూర్ ఖేరి ఘటనపై వాస్తవాలతో కూడిన మెమొరాండం సమర్పించందుకు కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను బుధవారంనాడు కలుసుకోనుంది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్జే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆడాద్, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉండనున్నారు. రైతులపై కారును నడపి వారి మృతికి కారణమైన లఖింపూర్ ఖేరి కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Updated Date - 2021-10-12T21:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising