ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ఒకే విమానంలో travel..చిరునవ్వుతూ పలకరించుకున్న వేళ...

ABN, First Publish Date - 2021-10-23T14:06:19+05:30

కాంగ్రెస్ పార్టీ యూపీ ప్రధాన నాయకురాలు ప్రియాంకగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన నేత అఖిలేష్ యాదవ్‌లు శుక్రవారం రాత్రి ఒకే విమానంలో ప్రయాణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : కాంగ్రెస్ పార్టీ యూపీ ప్రధాన నాయకురాలు ప్రియాంకగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన నేత అఖిలేష్ యాదవ్‌లు శుక్రవారం రాత్రి ఒకే విమానంలో ప్రయాణించారు.ఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో ప్రయాణించిన ఇద్దరు కీలక నేతలు యాదృచ్చికంగా విమానంలో కలిసి చిరునవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు.‘‘కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ల మధ్య ఢిల్లీ నుంచి లక్నో వెళ్లే విమానంలో ప్రణాళిక లేని మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ సమావేశం యాదృచ్ఛికంగా జరిగిందని, ఇద్దరి మధ్య ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదు’’అని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది.


2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రియాంకగాంధీ ప్రతిజ్ఞ యాత్రలను శనివారం ప్రారంభించేందుకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి వచ్చారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని లక్నోకు తిరిగి వస్తూ ఒకే విమానంలో ప్రయాణించారు.విమానంలో తీసిన ఫొటోలో అఖిలేష్ ధరించిన మాస్కు వెనుక నుంచి నవ్వుతూ ప్రియాంకాగాంధీతో పలకరించుకోవడం కనిపించింది.


ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రియాంకాగాంధీ, అఖిలేష్ ఇద్దరూ నేతలు అధికార బీజేపీపై విమర్శలను తీవ్రతరం చేశారు. యాదవేతర వెనుకబడిన కులాలను సమీకరించడంపై అఖిలేష్ దృష్టి సారించగా, పార్టీ టిక్కెట్లలో 40శాతం మహిళా అభ్యర్థులకు కేటాయిస్తున్నట్లు ప్రియాంకగాంధీ ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాడుతుందా లేదా మిత్రపక్షాల మద్దతును కోరుతుందా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.యూపీలోని  ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీతో పొత్తును తిరస్కరించాయి.


Updated Date - 2021-10-23T14:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising