ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యావరణహిత బొమ్మల తయారీ అవసరం

ABN, First Publish Date - 2021-02-28T09:44:11+05:30

తక్కువ పాస్లిక్‌, ఎక్కువ పర్యావరణ అనుకూల సామగ్రిని వినియోగించాలని బొమ్మల తయారీదారులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. బొమ్మల తయారీకి సంబంధించిన ప్రపంచ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మల తయారీదారులకు ప్రధాని పిలుపు

నిర్మల్‌, ఏటికొప్పాక బొమ్మల్ని మెచ్చుకున్న నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : తక్కువ పాస్లిక్‌, ఎక్కువ పర్యావరణ అనుకూల సామగ్రిని వినియోగించాలని బొమ్మల తయారీదారులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. బొమ్మల తయారీకి సంబంధించిన ప్రపంచ మార్కెట్లో దేశీయ పరిశ్రమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు. పర్యావరణహిత బొమ్మల తయారీవల్ల ముడిసామగ్రిని మళ్లీమళ్లీ వాడడానికి (రీసైక్లింగ్‌) వీలవుతుందని అన్నారు. తొలి భారతీయ బొమ్మల ప్రదర్శనను ప్రధాని శనివారం ఇక్కడ ప్రారంభించారు. బొమ్మల తయారీ రంగంలో ఆత్మనిర్భర్‌ను సాధించాలని ఆయన పిలుపు ఇచ్చారు.


దేశంలోని 85 శాతం బొమ్మలు ఇంకా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని.. ఈపరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని నిర్మల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఏటికొప్పాక బొమ్మల సంప్రదాయశైలిని పస్తావించారు. దేశంలో చేతితో తయారైన బొమ్మలను ప్రోత్సహించాలని కోరారు. 

Updated Date - 2021-02-28T09:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising