ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చార్‌ధామ్ అర్చకుల రాష్ట్రవ్యాప్త నిరసన

ABN, First Publish Date - 2021-08-11T01:21:54+05:30

చార్‌ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అర్చకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చార్‌ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అర్చకులు, దేవాలయాల కమిటీలు నిర్ణయించాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన ఈ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని చార్‌ధామ్, 47 ఇతర దేవాలయాల కమిటీలు, అర్చకులు నిర్ణయించారు. 


ఈ బోర్డును రద్దు చేయాలని ప్రస్తుతం చార్‌ధామ్ దేవాలయాలైన బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలను అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలకు, అదేవిధంగా రాష్ట్ర రాజధాని నగరం డెహ్రాడూన్‌కు విస్తరించాలని నిర్ణయించారు. 


ఈ బోర్డును 2020 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది కొనసాగాలని కోరుకునే స్థానిక ప్రజా ప్రతినిధులను వ్యతిరేకించాలని ఈ దేవాలయ కమిటీలు, అర్చకులు నిర్ణయించారు. 


చార్‌ధామ్ తీర్థ్ పురోహిత్ హక్-హకూక్‌ధారీ మహాపంచాయత్ అధ్యక్షుడు కృష్ణకాంత్ కొఠియాల్ మాట్లాడుతూ, నూతన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా ఈ బోర్డును రద్దు చేయడానికి తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ బోర్డు ఏర్పాటైన తర్వాత పరిస్థితులను హై పవర్ కమిటీ పరిశీలిస్తుందని చెప్తున్నారన్నారు. 


Updated Date - 2021-08-11T01:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising