ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర గవర్నర్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫోన్

ABN, First Publish Date - 2021-07-24T19:34:04+05:30

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాష్ట్రపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఫోన్ చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల సహాయం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి రాష్ట్రపతికి గవర్నర్ వివరించారు. రాష్ట్రపతి భవన్ శనివారం ఓ ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపింది. 


మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, మహద్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 44 మంది మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన 35 మందికి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెటివార్ తెలిపిన వివరాల ప్రకారం, భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం వరకు 136 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. 


Updated Date - 2021-07-24T19:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising