ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రిలో గర్భిణి మృతి... కరోనా టీకానే కారణం?

ABN, First Publish Date - 2021-08-23T16:20:25+05:30

కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒక ఆసుపత్రిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొట్టాయం: కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒక ఆసుపత్రిలో 31 ఏళ్ల గర్భిణి మృతి వివాదాస్పదంగా మారింది. ఆమె మృతికి కరోనా టీకానే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాక్సీన్ దుష్పరిమాణాల కారణంగానే ఆ మహిళ మృతి చెందిందని ఆమె సంబంధీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మృతురాలి పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ రిపోర్టు కోసం వైద్యశాఖాధికారులు ఎదురు చూస్తున్నారు. మృతురాలి భర్త ఈ విషయమై విచారణ జరిపించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రంజీత్‌ను డిమాండ్ చేస్తున్నారు. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం మాథ్యూ అనే మహిళకు ఆగస్టు 6న కొవిషీల్డ్ టీకా తొలి డోసు తీసుకుంది. దీనికిముందు ఆమె మెడిసిటీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా, ఆమె గర్భవతి అని నిర్ధారణ చేశారు. దీని తరువాత ఆమెకు ఆగస్టు 11 న తీవ్రమైన తలనొప్పి వచ్చింది. నాలుగు రోజుల అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆగస్టు 16న ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఆ తరువాత ఆగస్టు 20న ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతికి సెరెబ్రల్ వీనస్ థ్రోంబోసిస్, థ్రోంబోసైటోపెనియా కారణమని డెత్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో మృతురాలి పోస్టుమార్టం రిపోర్టు కోసం వైద్యశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు.  

Updated Date - 2021-08-23T16:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising