ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాబోయే చాలా దశాబ్దాలు బీజేపీవే: పీకే

ABN, First Publish Date - 2021-10-29T08:21:26+05:30

భారత రాజకీయాల్లో బీజేపీ కీలకంగానే కొనసాగుతుందని, ‘రాబోయే చాలా దశాబ్దాలపాటు’ ఆ పార్టీ ఎక్కడికీ పోదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భారత రాజకీయాల్లో బీజేపీ కీలకంగానే కొనసాగుతుందని, ‘రాబోయే చాలా దశాబ్దాలపాటు’ ఆ పార్టీ ఎక్కడికీ పోదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీని ప్రజలు ఇప్పటికిప్పుడు గద్దె దించుతారని రాహుల్‌ గాంధీ కలలు కంటున్నారని, అది జరిగేది కాదని చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పని చేస్తున్న ఆయన బుధవారం పణజిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా ప్రశాంత్‌ కిషోర్‌ చేరతారని, ఆయన చేరికను పార్టీలో వ్యతిరేకించారని వార్తలు వచ్చాయి. గాంధీ కుటుంబంతో ప్రశాంత్‌ కిషోర్‌ చర్చలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘గెలవవచ్చు.. లేదా ఓడిపోవచ్చు. కానీ, భారత రాజకీయాల్లో బీజేపీ కేంద్రకంగానే ఉండనుంది. జాతీయస్థాయిలో ఒక్కసారి కనక 30 శాతానికిపైగా ఓట్లు సాధిస్తే.. హఠాత్తుగా కనుమరుగు కావడం జరగదు. ఒకవేళ, ప్రజలు మోదీని గద్దె దింపవచ్చు. కానీ, బీజేపీ ఎక్కడికీ పోదు’’ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-29T08:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising