ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్‌ సీఎం సలహాదారుగా ప్రశాంత్‌ కిశోర్‌

ABN, First Publish Date - 2021-03-02T07:14:46+05:30

పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నియమితుడయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అమరీందర్‌ సింగ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. పంజాబ్‌ ప్రజల సంక్షేమం కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్‌, మార్చి 1: పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నియమితుడయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అమరీందర్‌ సింగ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. పంజాబ్‌ ప్రజల సంక్షేమం కోసం మరింత సమర్థంగా పని చేయనున్నామని పేర్కొన్నారు. అనంతరం ఈ విషయంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ప్రశాంత్‌ కిశోర్‌కు కేబినెట్‌ ర్యాంకు, హోదాను ఇవ్వడానికి రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకుగాను ప్రశాంత్‌ కిశోర్‌ నెలకు రూ.1 మాత్రమే తీసుకుంటున్నారని చెప్పింది. వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమరీందర్‌తో కలిసి ప్రశాంత్‌ కిశోర్‌ పని చేస్తుండడం గమనార్హం. 2017 పంజాబ్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేశారు. ఆ పార్టీ అప్పట్లో విజయం సాధించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేస్తున్నారు. 

Updated Date - 2021-03-02T07:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising