ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab CM Advisor: ప్రశాంత్ కిషోర్ రాజీనామా

ABN, First Publish Date - 2021-08-05T15:45:53+05:30

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రిన్సిపల్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ తన పదవికి రాజీనామా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రిన్సిపల్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా తాను తాత్కాలికంగా విరామం తీసుకోవాలనుకుంటున్నానని తన రాజీనామా లేఖలో ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.‘‘ప్రజా జీవితంలో నేను చురుకైన పాత్ర పోషించాలని ఉన్నందున తాత్కాలిక విరామం తీసుకోవాలనే నా నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను మీ ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా బాధ్యతలు స్వీకరించలేకపోయాను. నా భవిష్యత్తు కార్యాచరణపై నేను ఇంకా నిర్ణయం తీసుకోనందున, దయచేసి నన్ను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’అని ప్రశాంత్ కిషోర్ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ క్రియాశీల రాజకీయాల్లోకి దిగనున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-08-05T15:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising