ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడి... కొత్త అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ?...

ABN, First Publish Date - 2021-08-15T21:50:14+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు మధ్యవర్తిగా అత్యున్నత స్థాయి జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు. 


అంతకుముందు తాలిబన్లు ఓ ప్రకటనలో కాబూల్ ప్రజలకు హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించబోమని తెలిపారు. తాము శాంతియుతంగానే కాబూల్ వైపు వస్తున్నట్లు తెలిపారు. 


ఇదిలావుండగా, ప్రభుత్వ దళాల నుంచి ఎటువంటి నిరోధం లేకుండానే కాబూల్‌లోకి తాలిబన్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ అగ్ర నేతలు తమ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాచారంలో, కాబూల్ గేట్ల వద్దనే వేచి ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-08-15T21:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising