ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైంగిక దాడులపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పోప్ ఫ్రాన్సిస్

ABN, First Publish Date - 2021-10-06T02:59:30+05:30

ఫ్రాన్స్‌లోని కేథలిక్ చర్చిలలో గడచిన 70 ఏళ్ళలో చర్చి బోధకులు, సిబ్బంది చేతుల్లో దాదాపు 3,30,000

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాటికన్ సిటీ: ఫ్రాన్స్‌లోని కేథలిక్ చర్చిలలో గడచిన 70 ఏళ్ళలో చర్చి బోధకులు, సిబ్బంది చేతుల్లో దాదాపు 3,30,000 మంది బాలలు లైంగిక దోపిడీకి గురైనట్టు వచ్చిన వార్తలపై పోప్ ఫ్రాన్సిస్ ‘తీవ్ర విచారం’ వ్యక్తం చేశారు.  లైంగిక దురాగతాలను బయటపెట్టేందుకు ఏర్పాటైన ఇండిపెండెంట్ కమిషన్ నివేదిక ఈ ఒళ్ళు గగుర్పొడిచే అంశాలను వెల్లడించగా, పోప్ ఇలా స్పందించినట్టు వాటికన్ అధికార ప్రతినిధి మటెయో బ్రూనీ తెలిపారు. దర్యాప్తులో వెల్లడైన నిజాలు పోప్‌ను ‘తీవ్ర బాధ’కు గురిచేశాయన్నారు.


1950 నుంచి ఈ దురాగతం జరుగుతున్నట్టు నివేదిక బయటపెట్టడం సంచలనమైంది. పోప్ విచారం వ్యక్తం చేసిన నోట్‌ను ఫ్రెంచ్, ఇటాలియన్‌లో విడుదల చేశారు. ఫ్రాన్స్‌లోని క్రైస్తవుల కోసం పోప్ ప్రార్థనలు చేశారని, మరీ ముఖ్యంగా బాధితుల కోసం ప్రార్థించారని, తద్వారా వారికి భగవంతుడి నుంచి ఓదార్పు లభిస్తుందని బ్రూనీ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-06T02:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising